Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అఖిల్ మజ్ను ట్రైలర్ కాపీల పుట్టా..? అబ్బా.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ.. (video)

అక్కినేని నట వారసుడిగా అఖిల్‌ మూడేళ్ల క్రితం సినీ తెరంగేట్రం చేశాడు. కానీ అఖిల్, హలో అనే రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే ధ్యేయంతో అఖిల్ తన మూడో స

అఖిల్ మజ్ను ట్రైలర్ కాపీల పుట్టా..? అబ్బా.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ.. (video)
, బుధవారం, 26 సెప్టెంబరు 2018 (14:25 IST)
అక్కినేని నట వారసుడిగా అఖిల్‌ మూడేళ్ల క్రితం సినీ తెరంగేట్రం చేశాడు. కానీ అఖిల్, హలో అనే రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే ధ్యేయంతో అఖిల్ తన మూడో సినిమాను ప్రారంభించారు. ''తొలిప్రేమ''తో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ ఈ సినిమా చేస్తున్నాడు. 
 
ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ లుక్‌లో అఖిల్ అదరగొట్టినా.. ట్రైలర్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మజ్ను ట్రైలర్ కాపీల పుట్టా.. అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. మజ్ను డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పాత పచ్చడేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
 
ఈ ట్రైలర్లో అఖిల్ వాకింగ్ స్టైల్ చూస్తే నాగార్జున దిగిపోయాడని నెటిజన్స్ అంటున్నారు. అఖిల్ వాకింగ్ స్టైల్ రిపీట్ మోడ్‌లో వుందని టాక్. అఖిల్ మజ్ను ట్రైలర్లోని డైలాగులు ఏఎన్నార్ ప్రేమ్ నగర్ నుంచి తీసుకున్నవని చెప్పేందుకు వీలుగా.. వీడియోలు కూడా అటాచ్ చేశారు. 
 
ఈ సినిమా ఫ్రెష్‌గా వుందని.. హీరో రామ్ చరణ్‌తో పాటు కొందరు నెటిజన్లు కితాబిచ్చినా.. అఖిల్ తాతను ఫాలో అవుతున్నాడని చాలామంది ముద్రవేశారు. అంతేకాదు.. దర్శకుడు అట్లీ బొమ్మ పెట్టి.. అఖిల్‌తో సినిమా చేయమని.. అప్పుడైనా అతని రేంజ్ మారుతుందని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. #MrMajnu vs original పేరిట ఓల్డ్ వీడియోలకు మజ్ను టీజర్‌ను జత చేసి నెటిజన్స్ ఆడుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో ప్రభుదేవా పాట, నాగార్జున డ్యాన్స్, ఏఎన్నార్ డైలాగ్స్‌కు మజ్ను టీజర్‌కి తేలికపాటి పోలికలున్నాయి. నాగ్ చెప్పిన మాట విని వుంటే బెటరని కొందరు, చైతూ లుక్‌లో వున్నావని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ హెయిర్ స్టైల్ బాగోలేదని, ఎంతకాలం ఇలాంటి కాపీ సినిమాలను చూస్తూ ప్రజలు డబ్బులు వృధా చేసుకుంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ అఖిల్ మజ్ను టీజర్ నాలుగు మిలియన్ల వ్యూస్ దాటింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నానా పటేకర్ కూడా అలాంటివాడేనా? ఆ హీరోయిన్‌ను కోర్కె తీర్చమన్నాడా?