Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

క్రేజీ కాంబినేషన్.. క్రేజీ రేట్ : "అఖండ" శాటిలైట్ రైట్స్ ఎంతో తెలుసా?

Advertiesment
Akhanda
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (08:56 IST)
యువరత్న బాలకృష్ణ - సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతోంది. గతంలో  "సింహా", "లెజెండ్" వంటి చిత్రాలు వచ్చాయి. ఇపుడు కొత్త చిత్రానికి "అఖండ" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటిస్టుంటే విలన్ పాత్రలో హీరో శ్రీరాంత్ నటిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం శాటిలైట్ రైట్స్ ధరలు కూడా కూడా క్రేజీ రేటుకు అమ్ముడుపోయాయి. 
 
ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ చిత్రం షూటింగును శరవేగంగా జరుపుతున్నారు. దీనికి కారణం విడుదల తేదీని కూడా ఎనౌన్స్ చేసిన కారణంగా, ఆ దిశగా చకచకా పనులను పూర్తిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ .. డిజిటల్ రైట్స్‌కి సంబంధించిన టాక్ జోరుగా షికారు చేస్తోంది.
 
ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ రైట్స్‌ను 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్', 'స్టార్ మా' వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. ఈ రెండు హక్కుల నిమిత్తం రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకూ డీల్ కుదిరినట్టుగా సమాచారం. బాలకృష్ణ కెరియర్లో అత్యధిక రేటు పలికిన సినిమా ఇదేనని అంటున్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో హీరో బాలయ్య రైతుగా, అఘోరగా డిఫరెంట్ లుక్స్‌తో కనిపించనున్నారు. అలాగే, ప్రతినాయకుని పాత్రలో హీరో శ్రీకాంత్ మాంచి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ క్రేజీ కాంబోపై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతులెత్తి మొక్కుతాం... ప్రజలారా బయటకురావొద్దు : ప్రియాంకా చోప్రా