టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి తాజాగా చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేశారు.
ఇవి అభిమానులతో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచాయి. మే 28న విడుదల కానున్న ఈ చిత్రం ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకోగా.. హాట్ స్టార్ ఓటీటీ హక్కుల్ని చేజిక్కించుకుంది.
ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్ భారీ మొత్తంకు దక్కించుకుందని ఇన్‌సైడ్ టాక్. టీజర్‌లో బాలయ్య తన చేతిలో త్రిశూలం మెడలో రుద్రాక్షలతో అఘోరా గెటప్‌లో కనిపించి సంచలనాలు సృష్టించాడు.
ఈ పాత్రలో అతడి ఆహార్యం పీక్స్‌కు చేరడంతో డీల్‌పై హైప్ పెరిగింది. గత చిత్రాల కన్నా ఈ సినిమాపై బాలయ్య అభిమానులలోను భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రగ్య జైశ్వాల్ కథానాయికగా నటించింది.
ముఖ్యంగా, సింహా, లజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవచ్చన్న అంచనాలు పెరిగిపోయాయి.