తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే షోకు నందమూరి హీరో బాలయ్య బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మళ్లీ ఈ హోస్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
"అన్ స్టాపబుల్ విత్ NBK2" తో బాలయ్య అలరించేందుకు రాబోతున్నట్లు ఓటిటి ప్లాట్ ఫామ్ "ఆహా" ప్రకటించింది. "పండుగ త్వరలో ప్రారంభం కానుంది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలి" అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం NBK 107 సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉన్నారు.