Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్ చరణ్, అల్లు అర్జున్ స్ఫూర్తితో ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తెరంగేట్రం

ETV Prabhakar, Chandrahas, Malayaja
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (17:05 IST)
ETV Prabhakar, Chandrahas, Malayaja
ఈటీవీ ప్రభాకర్ త‌న‌యుడు చంద్రహాస్ హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. సెప్టెంబ‌ర్ 17న చంద్ర‌హాస్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ప్ర‌భాక‌ర్ త‌న కుమారుడిని  ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో విలేక‌రుల‌కు ప‌రిచ‌యం చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌హాస్ మాతృమూర్తి మలయజ త‌న‌ కుమారుడు నటిస్తున్న చిత్రాల నుంచి హ్యాపీబర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్‌ను ఆవిష్క‌రించారు. 
 
అనంత‌రం ఈటీవీ ప్రభాకర్‌ మాట్లాడుతూ, హీరో కావాలనేది కేవలం చంద్రహాస్‌ కోరిక మాత్రమే. చాలా కాలం నుంచి యాక్టర్‌ అవుతా అని నా వెంట పడుతున్నాడు. కానీ నేనే ఇప్పుడే వద్దు, ముందు చదువు పూర్తి చెయ్యి. ఆ తర్వాతే ఏదైనా అన్నాను. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సినిమా హీరోకు కావాల్సిన ఫైట్స్‌, డాన్స్‌లు, యాక్టింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ తీసుకుంటూ తనను తాను తీర్చి దిద్దుకున్నాడు. ఓ రోజు నా దగ్గరకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వు డాడీ దాంతో నేను యూట్యూబ్‌లో కవర్‌ సాంగ్స్‌ చేసుకుంటాను. అలా నన్ను నేను పరిశ్రమకు పరిచయం చేసుకుంటాను అన్నాడు. అలా చేసిన ‘‘నాటు నాటు’’ అనే కవర్‌ సాంగ్‌ వీడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పేరుతో పాటు సినిమా హీరోగా కూడా రెండు అవకాశాలు వచ్చాయి. ఈ విషయంలో నేను ఆశ్చర్యపోయాను. 
గతంలో రెండు సినిమాలు నిర్మించిన  ప్రొడ్యూసర్స్‌ కిరణ్‌ బోయినపల్లి, కిరణ్‌ జక్కంశెట్టిలు ఐ.ఇ.ఎఫ్‌, ఆర్‌.కె-ఏ.కె ఫిలింస్‌ పతాకం ‘ప్రొడక్షన్‌ నెం.3’గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన దర్శకత్వం కృష్ణ. అలాగే ఏవీఆర్‌ మూవీ వండర్స్‌ పతాకంపై గతంలో రెండు సినిమాలను నిర్మించిన ఏవీఆర్‌, నరేష్‌ గార్లు తమ మూడో చిత్రంగా ‘ప్రొడక్షన్‌ నెం.3’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దర్శకుడు సంపత్‌ వి. రుద్ర. వీరితో పాటు మా స్వంత సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించటానికి ప్లాన్‌ చేశాం. దీనికి నా మిత్రులు కళ్యాణ్‌, వెంకట్‌, కాముని శివ, ప్రేమ్‌ సాగర్‌, తోట సురేష్‌లు కో`ప్రొడ్యూసర్‌లు అని తెలిపారు.
 
webdunia
chandrhas with producers
చంద్రహాస్‌ మాతృమూర్తి మలయజ మాట్లాడుతూ,  చంద్రహాస్‌ కూడా వాళ్ల నాన్నగారిలానే మంచి హార్డ్‌ వర్కర్‌. ఏదైనా అనుకుంటే చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాడు. అలా పట్టుబట్టి ఈరోజు హీరోగా మారుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఆశీర్వదించాలని .. కోరారు.
 
హీరో చంద్రహాస్‌ మాట్లాడుతూ... నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారితో పాటు అనేక మంది నటీనటులు, టెక్నీషియన్స్‌ల మధ్య సినిమాలు, టీవీ సీరియల్స్‌, టెలీ ఫిలిమ్స్‌ ఇలా షూటింగ్‌ల వాతావరణంలోనే పెరిగాను. హీరో అవ్వాలనేది నా డ్రీమ్‌. నటనతో పాటు పరిశ్రమలోకి అడుగుపెట్టేటప్పుడు మన బిహేవియర్‌ కూడా చాలా ముఖ్యం. నాన్నగారి కెరీర్‌లో అప్స్‌ అండ్‌ డౌన్స్‌ నేను కళ్లారా చూశాను. అయినప్పటికీ ఆయన బిహేవియర్‌తోనే ఇప్పటికీ వ్యక్తిగా అందరూ ఇష్టపడే స్థాయిని కొనసాగిస్తున్నారు. నేను కూడా ఇలాగే అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగాలని మా అమ్మగారి కోరిక. ఆమె నాకు చెప్పిన ముఖ్యమైన విషయం కూడా ఇదే. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించడానికి నా వైపు నుంచి ఎటువంటి లోపం లేకుండా కృషి చేస్తాను. పరిశ్రమలోనే చాలా మందిని చూసి  ఇన్‌స్పైర్‌ అయ్యాను.

ముఖ్యంగా రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ల డెడికేష‌న్ చూసి స్పూర్తిపొందాను. మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలని ముందుగా మిమ్మల్ని కలిసేందుకు ఈ చిన్న ప్రయత్నం అన్నారు. 
ఈ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రహాస్‌ చిత్రాల నిర్మాతలు, దర్శకలు, ఇతర టెక్నీషియన్స్‌ను వేదిక మీదకు పిలిచి మీడియాకు పరిచయం చేశారు ప్రభాకర్‌. చివరిగా బంధుమిత్రులు, మీడియా, అతిథుల సమక్షంలో పుట్టినరోజు కేక్‌ కట్‌ చేశారు చంద్రహాస్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైద్ ఖాన్, జయతీర్థ పాన్ ఇండియా చిత్రం బనారస్ నుండి ట్రోల్ సాంగ్