Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జైద్ ఖాన్, జయతీర్థ పాన్ ఇండియా చిత్రం బనారస్ నుండి ట్రోల్ సాంగ్

Advertiesment
Banaras troll song
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (16:14 IST)
Banaras troll song
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్‌' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు,
 
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ట్రోల్ సాంగ్’ విడుదలైంది. బి. అజనీష్ లోక్‌నాథ్ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన పార్టీ సాంగ్ ఇది. పాట చాలా హుషారుగావుంది. జాస్సీ గిఫ్ట్ వాయిస్ మరింత ఉత్సాహాన్ని తెచ్చింది.    భాస్కరభట్ల సాహిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఆసక్తికరంగా సాగింది. జైద్ ఖాన్  వండర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రొడక్షన్స్ చాలా వైబ్రైంట్ కనిపిస్తోంది
 
ఈ చిత్రానికి అద్వైత గురుమూర్తి డీవోపీగా,  కెఎం ప్రకాష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్   భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది.
 
తారాగణం: జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ  తదితరులు
 
సాంకేతిక విభాగం
రచన,  దర్శకత్వం: జయతీర్థ
నిర్మాత: తిలకరాజ్ బల్లాల్
బ్యానర్: ఎన్ కె ప్రొడక్షన్స్
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: అద్వైత గురుమూర్తి
యాక్షన్: ఎ వుయి, డిఫరెంట్ డానీ
డైలాగ్స్: రఘు నిడువల్లి
లిరిక్స్ : డా.వి.నాగేంద్రప్రసాద్
ఎడిటర్: కె ఎం ప్రకాష్
ఆర్ట్: అరుణ్ సాగర్, శీను
కొరియోగ్రాఫర్: జయతీర్థ, ఎ హర్ష
పోస్ట్ సూపర్‌వైజర్ - రోహిత్ చిక్‌మగళూరు
కాస్ట్యూమ్: రష్మీ, పుట్టరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైబి రెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్: చరణ్ సువర్ణ, జాకీ గౌడ
పబ్లిసిటీ డిజైన్: అశ్విన్ రమేష్
పీఆర్వో : వంశీ-శేఖర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: రివ్యూ రిపోర్ట్‌ ఇలా వుంది