Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస‌క్తిగా సాగే అం అః చిత్ర కథ. - రివ్యూ రిపోర్ట్‌

Advertiesment
Am Aha,
, శనివారం, 17 సెప్టెంబరు 2022 (09:12 IST)
Am Aha,
నటీన‌టులు: సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య‌, సిరి కనకన్, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు త‌దిత‌రులు 
 
సాంకేతిక‌త‌- ద‌ర్శ‌కుడు: శ్యామ్ మండ‌ల‌ నిర్మాత‌: జోరిగె శ్రీనివాస్ రావు బ్యాన‌ర్స్‌: రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ కో ప్రొడ్యూస‌ర్‌: అవినాష్ ఎ.జ‌గ్త‌ప్‌ లైన్ ప్రొడ్యూస‌ర్‌: ప‌ళ‌ని స్వామి సినిమాటోగ్రాఫ‌ర్‌: శివా రెడ్డి సావ‌నం మ్యూజిక్‌: సందీప్ కుమార్ కంగుల‌ ఎడిటర్: జె.పి పిఆర్వో: సాయి సతీశ్, పర్వతనేని రాంబాబు బ్యానర్: రంగస్థలం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌ 
 
ఈమ‌ధ్య కొత్త ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు వినూత్న‌మైన క‌థ‌ల‌తో ముందుకు వ‌స్తున్నారు. అలాంటి ఓ ప్ర‌య‌త్న‌మే అం ఆః. శుక్ర‌వార‌మే విడుద‌లైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
క‌థ‌గా చెప్పాలంటే.
న‌లుగురు ఇంజనీరింగ్ విద్యార్థులయిన‌ కల్యాణ్ (సుధాకర్ రెడ్డి), భల్లూ (రాజా) అరవింద్ ( ఈశ్వర్) క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సాధించి సంతోషంలో ఉంటారు. ఆ ఆనందంలో పబ్‌లో పార్టీకి వెళ్లి వస్తూ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుపోతారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే.. 20 లక్షలు ఇవ్వాలని సీఐ ఫణీంద్ర (రవిప్రకాశ్) డిమాండ్ చేస్తాడు. దిక్కు తోచని పరిస్థితుల్లో కావ్య (సిరి) అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి.. వారి తల్లిదండ్రుల నుంచి 20 లక్షలు డిమాండ్ చేస్తారు. ఈ క్రమంలో మాఫియా డాన్ జీఆర్ (రామరాజు) హత్య జరుగుతుంది. ఆ త‌ర్వాత క‌థ ఎటువైపు మ‌ళ్ళింది. ఈ న‌లుగురు బ‌య‌ట‌ప‌డ్డారా? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేష‌ణ‌-
 
క‌థ విన‌డానికి మ‌న‌కు పాత‌క‌థే అనిపిస్తుంది.  కాకపోతే ట్విస్టులో కథను విస్తరించే తీరు సాగదీసినట్టు ఉన్నా.. ఆసక్తికరంగా చెప్పగలిగాడనే ఫీలింగ్ కలుగుతుంది. చివరిలో ఎస్పీ, ముగ్గురు కుర్రాళ్ల మధ్య సినిమాకు మంచి ట్విస్టు ఫీల్ అందిస్తుంది. కాకపోతే ఈ సినిమా నిడివి, సాగదీసినట్టు కథ లాగించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులుగా సుధాకర్ రెడ్డి, రాజా, ఈశ్వర్ కొత్తవారైనా తమ పాత్రలను మంచి ఈజ్‌తో చేశారు. అనుభవం ఉన్న నటులుగా నటించారు. కిడ్నాప్ గురైన కావ్య సీఐ కూతురుగా నటించింది. విలన్ పాత్రలో జీఆర్‌గా రామరాజు తన నటనతో ఆకట్టుకొన్నాడు. ఎస్పీ రాజశ్రీ నాయర్ మరోసారి ఇంట్రెస్టింగ్ పాత్రలో నటించడమే కాకుండా కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.  
 
సాంకేతిక‌ప‌రంగా చెప్పాలంటే... సినిమాటోగ్రాఫ‌ర్‌: శివా రెడ్డి సావ‌నం సినిమాను రిచ్‌గా, అందంగా తీర్చి దిద్దారు. సందీప్ కుమార్ కంగుల‌ మ్యూజిక్‌ కథ, కథనాలకు తగినట్టుగా బాగుంది. ఎడిటర్: జేపికి ఇంకా కావాల్సినంత పని ఉంది. చాలా కంటెంట్‌పై కత్తెర వేస్తే సినిమా వేగం అందుకొనే అవకాశం ఉంది. చిన్న సినిమా అయినప్పటికీ. జోరిగె శ్రీనివాస్ రావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.  ఇప్పుడు సామాజిక అంశంలో భాగంగా అంద‌రినీ నానున్న విష‌యం డ్రగ్స్ మాఫియా. ఈ  నేపథ్యంగా థ్రిల్లర్, మర్డర్ మిస్టరీగా రూపొందిన చిత్రం అం ఆః. మ‌రికొంత క‌స‌ర‌త్తు చేస్తే మ‌రింత బాగుండేది. ఇలాంటి అంద‌రికీ న‌చ్చేలా ద‌ర్శ‌కుడు తీయ‌గ‌లిగాడు. 
రేటింగ్‌-2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్సనల్ మేకప్ మెన్ బాబు మృతి.. రావు రమేష్ రూ.10లక్షల ఆర్థికసాయం