Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ నామస్మరణలో జీవిత... పవన్ రాజకీయాలకు 'సరైనోడు' కాదు

Advertiesment
Jeevitha Rajasekhar
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:10 IST)
టాలీవుడ్ పూర్తిగా వైకాపాకి క్యూ కట్టేసినట్టు తెలుస్తోంది. సోమవారం కూడా సినీనటులు జీవితా రాజశేఖర్‌తో పాటు మరికొంతమంది వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడెప్పుడో వైకాపాలో ఉంటూ ప్రజలలో తమకు వస్తున్న ఫాలోయింగ్‌ను చూసి పార్టీ అధినేత జగన్ ఓర్చుకోలేకపోతున్నాడంటూ... కళ్లద్దాలు పెట్టుకు వెళ్తే కూడా అవమానిస్తున్నాడని ఆరోపిస్తూ... పార్టీని వదిలివెళ్లిపోయిన రాజశేఖర్, జీవితల జంట రాజకీయాలలో శాశ్వత శత్రుత్వాలు ఉండవని నిరూపిస్తూ... తాజాగా మళ్లీ వైకాపా తీర్థం పుచ్చుకుంది. 
 
ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ... ఇప్పుడు జగన్, తాము ఇరువురమూ మారిపోయామనీ... అవన్నీ చిన్న చిన్న విషయాలని కూడా చెప్పుకొచ్చేసారు. పనిలోపనిగా వాళ్లు జనసేనానిపై పలు సంచలన ఆరోపణలు కూడా చేసేసారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆటిట్యూడ్ చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌నీ, రాజ‌కీయాల్లో అది ఉండ‌కూడ‌ద‌ని ఎద్దేవా చేసిన జీవిత... అక్క‌డితో ఆగ‌కుండా జ‌న‌సేనలో అన్నీ తాను అనుకున్న‌ట్లుగానే జ‌ర‌గాల‌ని ప‌వ‌న్ కోరుకుంటాడ‌న్నారు. 
 
అస‌లు ఆయ‌న ప‌క్క వాళ్ల మాట‌లు ఎప్పుడూ ప‌ట్టించుకోడ‌ని కూడా ఆరోపించారు. ప‌వ‌న్ త‌న పార్టీలో ఉన్న సీనియ‌ర్స్ మాట కూడా ప‌ట్టించుకోడ‌ని ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆరోపించిన జీవిత రాజశేఖర్... వీటన్నింటితోపాటు పవన్ తెలుగుదేశం పార్టీ కోసం ప‌ని చేస్తున్నార‌నీ... అందుకే తాము ప‌వ‌న్ పార్టీలో చేర‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు‌. 
 
మొత్తానికి జ‌గ‌న్ పార్టీలోకి వ‌స్తూ వ‌స్తూనే ప‌వ‌న్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసేసిన జీవితా రాజశేఖర్ జంటకి పవన్‌తో మాత్రం శత్రుత్వం ఎంత కాలం ఉంటుందో... వీళ్లు మళ్లీ ఎప్పుడు ఆ పార్టీ గడప తొక్కుతారో అప్పుడు మళ్లీ పవన్ మారిపోయాడనే స్టేట్‌మెంట్ కూడా వస్తుందోమో... వేచి చూద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈటీవీ కామెడీ షో 'జ‌బ‌ర్ద‌స్త్' నుంచి నాగ‌బాబు, రోజాలు ఔట్..