Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంజలికి మరో ఛాన్స్... దిల్ రాజు ఎఫ్-3లో ఛాన్స్!

Advertiesment
అంజలికి మరో ఛాన్స్... దిల్ రాజు ఎఫ్-3లో ఛాన్స్!
, బుధవారం, 14 ఏప్రియల్ 2021 (14:28 IST)
తెలుగు సినీ నటి అంజలి రీ ఎంటీ బాగా కలిసివచ్చినట్టుగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ చిత్రంలో నటించిన అంజలి... ఇపుడు మరో చిత్రంలో చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో అంజలి నటనకు మంచి మార్కులే పడ్డాయి. 
 
నిజానికి గత కొంతకాలంగా అంజలికి టాలీవుడ్‌లో పేరు వచ్చే సినిమాలు రావడం లేదు. గత చిత్రం నిశ్శబ్ధం కూడా అంజలికి పెద్దగా ఉపయోగపడింది లేదనే చెప్పాలి. దాంతో తన నమ్మకాలు.. ఆశలన్నీ పవర్ స్టార్ "వకీల్ సాబ్" సినిమా మీదే పెట్టుకుంది. 
 
ఆమె పెట్టుకున్న నమ్మకాలు వమ్ము కాలేదు. 'వకీల్ సాబ్' సినిమాలో జరీనాగా కనిపించిన అంజలిని ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో అంజలి మరో సినిమాలో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందని తాజాగా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.
 
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ "ఎఫ్-3". ఎఫ్-2కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, వరు తేజ్ సరసన మెహ్రీన్ నటిస్తున్నారు. 
 
అయితే ఈ సినిమాలో మూడో హీరోయిన్ పాత్ర ఉండగా.. ఆ పాత్రకి సోనాల్ చౌహాన్‌ని ఎంపిక చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా సోనాల్ చౌహాన్ వచ్చే అవకాశాలు లేవట. అందుకే ఆ అవకాశం అంజలికి దక్కినట్టు తెలుస్తోంది. ఇంతక ముందు దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో అంజలి నటించి పేరు తెచ్చుకుంది. 
 
మళ్ళీ రీసెంట్‌గా వకీల్ సాబ్ సినిమాలో చేసే అవకాశం ఇచ్చాడు దిల్ రాజు. ఈ క్రమంలో మరోసారి దిల్ రాజు ఎఫ్ 3లో నటించే అవకాశం అంజలికి కల్పించినట్టు తెలుస్తోంది. త్వరలో ఎఫ్ 3 షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ మైసూర్ వెళ్ళనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో అంజలి కూడా జాయిన్ అవబోతోందట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ అపరచితుడుగా రణ్‌వీర్ - శంకర్ ప్రకటన