Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రామీణ నేపథ్యంలో రానా దగ్గుబాటి కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్

Advertiesment
Kothapalli lo okappudu poster

దేవీ

, గురువారం, 10 జులై 2025 (19:10 IST)
Kothapalli lo okappudu poster
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఫస్ట్ లుక్‌, టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.
 
లోకల్ రికార్డ్ డ్యాన్స్ స్టూడియో ఓనర్ అయిన రామకృష్ణ సావిత్రిని ప్రేమిస్తాడు. ఒక రోజు, సావిత్రి అతన్ని గడ్డివాము వద్ద కలవమని అడుగుతుంది. రామకృష్ణ చాలా ఉత్సాహంగా వెళ్తాడు. కానీ ప్రేమకథ ఇక్కడ షాకింగ్ మలుపు తిరుగుతుంది. అతని జీవితాన్ని గందరగోళంలోకి నెట్టివేస్తుంది. ఆ క్షణం నుండి ఊహించని మలుపులతో ఒక మిస్టీరియస్ డివైన్ ఎలిమెంట్ తెరపైకి రావడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.  
 
గురుకిరణ్ బతులా రాసిన ఈ కథ ఊహించని థ్రిల్లింగ్ అంశాలతో చిత్రానికి ప్రత్యేకమైన ప్లేవర్ ని తీసుకొచ్చింది. ప్రవీణ పరుచూరి సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. కీలకమైన పాత్రను కూడా పోషించారు.
 
లీడ్ పెయిర్ మనోజ్ చంద్ర, మోనికా టి తమ పాత్రలకు కొత్తగా నిజాయితీ గా ఉంటూ ఫ్రెష్ నెస్ తీసుకొచ్చాయి. రవీంద్ర విజయ్ అప్పన్నగా తన ప్రెజెన్స్ ని చాటుకున్నారు.
 
సినిమాటోగ్రాఫర్ పెట్రోస్ ఆంటోనియాడిస్ గ్రామీణ నేపథ్యాన్ని అందంగా చూపించారు. వరుణ్ ఉన్ని నేపథ్య సంగీతం పర్ఫెక్ట్ గా వుంది. పాటలను మణి శర్మ స్వరపరిచారు. నిర్మాణ విలువలు జోనర్ కి తగ్గట్టు మంచి క్యాలిటీలో వున్నాయి.
 
మొత్తంమీద, ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.
 
తారాగణం: మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల, రవీంద్ర విజయ్, ప్రవీణ పరుచూరి, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏలుమలై టీజర్‌ను రిలీజ్ చేసిన కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్