Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

Advertiesment
Celebrities

సెల్వి

, గురువారం, 10 జులై 2025 (10:48 IST)
Celebrities
యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు యూట్యూబర్లు, టాలీవుడ్‌‌, బాలీవుడ్ నటులతో ప్రమోషన్ ​చేయిస్తున్నారు. దీని కోసం వారికి లక్షల్లో, కోట్లల్లో చెల్లిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.  
 
బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ వ్యవహారంలో PMLA కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ప్రముఖుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయనుంది. వీరంతా PMLA నిబంధనలు ఉల్లగించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఈడీ అభియోగాలు మోపింది. తాజాగా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది.
 
బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు విజయ్‌ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్‌రాజ్‌, నిధి అగర్వాల్‌, అనన్య నాగళ్ల, శ్రీముఖి, అలాగే.. శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతలపై సైబరాబాద్‌ పోలీసుల ఎఫ్ఐఆర్‌ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్‌, ఇన్‌ఫ్యుయెన్సర్లపై పీఎంఎల్‌ఏ కింద విచారణ చేపట్టనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ