Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయేషా సైగల్‌కు పాప.. ఇంతలో ఆర్యపై జర్మనీ మహిళ కేసు.. పెళ్లి చేసుకుంటానని..?

సాయేషా సైగల్‌కు పాప.. ఇంతలో ఆర్యపై జర్మనీ మహిళ కేసు.. పెళ్లి చేసుకుంటానని..?
, శుక్రవారం, 30 జులై 2021 (11:09 IST)
సార్పట్ట సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్య.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇంకో విశేషం ఏంటంటే… ఈ మధ్యే ఆర్య భార్య సాయేషా సైగల్​.. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆ ఇంట ఆనందాలు విరబూశాయి. ఈ సమయంలో ఆర్యపై జర్మనీకి చెందిన ఓ మహిళ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. 
 
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆర్య.. రూ.70 లక్షలు తీసుకున్నాడని జర్మనీకి చెందిన విజ్డా ఆన్​లైన్​లో కంప్లైంట్ చేసింది. తామిద్దరి మధ్య జరిగిన వాట్సాప్​ చాట్​ను కూడా సమర్పించింది. ఆర్య తర్వాతి సినిమాలు విడుదల కాకుండా బ్యాన్ విధించాలని ఆమె కోరింది. ఈ కేసుపై గురువారం విచారణ జరిగింది. మరిన్ని ఆధారాలు సేకరించాలని జడ్జి.. పోలీసులను కోరారు. ఆగస్టు 17కు విచారణను వాయిదా వేశారు. అయితే ఈ విషయమై ఆర్య, అతడి టీమ్​ నుంచి ఎలాంటి స్పందన లేదు.
 
నాని ‘భలే భలే మగాడివోయ్’కు తమిళ రీమేక్​ ‘గజినికాంత్’ సినిమా షూటింగ్​లో కలుసుకున్న ఆర్య- సాయేషా లవ్‌లో పడ్డారు. 2019 మార్చి 10న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె భర్తతో కలిసి ‘టెడ్డీ’ సినిమా, కన్నడలో ‘యువరత్న’ మూవీ చేసింది. అయితే సాయేషా గర్భం దాల్చిన విషయాన్ని ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఆమె ప్రసవించిన తర్వాత, అది హీరో విశాల్​ చెబితేనే అందరికీ తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ - పూజా 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ ఫిక్స్