Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనిపించుట లేదు : ఠాణాలో ఫిర్యాదు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనిపించుట లేదు : ఠాణాలో ఫిర్యాదు
, గురువారం, 13 మే 2021 (13:12 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన మీడియా కంటికి చిక్కడం లేదు. అదేసమయంలో దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ఉధృతికి హోం మంత్రి అమిత్ షాతోపాటు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీలే కారణమని అంతర్జాతీయ మీడియా  కోడై కూస్తోంది. 
 
అదేసమయంలో హోం మంత్రి అమిత్ షా మిస్సింగ్ యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రేడ్ అవుతోంది. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ), ట్విట్టర్ ప్రకారం ఆయన ఆచూకీ తెలియడం లేదు. 
 
దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుండగా హెచ్‌ఎం (హోం మినిష్టర్‌) ‘ఎంఐఏ’ (మిస్సింగ్‌ ఇన్‌ యాక్షన్‌) అంటూ పలువురు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. కాగా, ఢిల్లీ పోలీసులు బుధవారం జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేశ్‌ కరియప్ప దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్‌ఎస్‌యుఐ కార్యాలయాన్ని సందర్శించారు.
 
‘ప్రస్తుతం పౌరులు సంక్షోభంలో ఉన్నారు.. అమిత్ షా మహమ్మారి మధ్య అదృశ్యమయ్యారు’ అని ఆరోపించారు. రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాల్సి ఉందని, సంక్షోభ పరిస్థితుల్లో నుంచి పారిపోకూడదని విద్యార్థి నాయకుడు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో.. భారత ప్రభుత్వం, బీజేపీకి మాత్రమే కాకుండా దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండడం రాజకీయ నాయకుల కర్తవ్యం అని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యశ్రీ వుంటే ఆపరేషన్ ఖాయం: కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరంగా మెడికల్ మాఫియా