Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

Advertiesment
Pawan poster

దేవీ

, గురువారం, 22 మే 2025 (11:52 IST)
Pawan poster
హరిహరవీరమల్లు సినిమాలో మూడో పాటను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిన్న చిత్ర నిర్మాత నిర్వహించారు. ఎ.ఎం.రత్నం నిర్మించిన ఈ సినిమాను ఐదేళ్ళ పాటు తీశారు. ఐదేళ్ళలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాననీ, ఫైనల్ గా విడుదలకు వచ్చిందని తెలిపారు. ఇక హరిహరవీరమల్లు సినిమా రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం జూన్ 12న విడుదలకాబోతుంది. అయితే ఇంకా మూడు భారీ ఈవెంట్లు చేయనున్నామని నిర్మాత చెప్పారు.
 
కాగా, ఈ సినిమా హైదరాబాద్ లో వేడుక జరిగింది. దీనికి తమిళం, మలయాళం, కన్నడ, బాలీవుడ్ మీడియా కూడా హాజరైంది. ఇంత భారీగా  చేయడానికి పవర్ స్టార్ కారణం. అయితే భారీ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? అనేది హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఖరీదైన పార్క్ హయత్ హోటల్ లో వేడుక జరగడంతో పవన్ వస్తారని భావించారు. అందుకు కారణం కూడా వుంది. ముందురోజే కీరవాణి కూడా తన టీమ్ తో పవన్ ను కలిశారు. ఆయన అప్పుడు హైదరాబాద్ లోనే వున్నారని తెలిసింది.
 
పైగా రెగ్యులర్ ఫంక్షన్ కు భిన్నంగా ముగ్గురు యాంకర్లు కార్యక్రమం నిర్వహించారు. తమిళం, హిందీ, తెలుగు యాంకర్లు తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సరికొత్తగా వేడుక నిర్వహించారు. దానితో పవన్ తప్పనిసరిగా వస్తారని నేషనల్ మీడియా భావించింది. ఇక రాజకీయపరంగా, సినిమా పరంగా పలు అనుమానాలకు పవన్ నివ్రుత్తి చేస్తారని మీడియా అంతా అనుకుంది. అంతకుముందు రోజు విడుదలైన పవన్ వీడియోను ఫంక్ష న్ లో విడుదల చేశారు.
 
మరి ఇంత భారీగా లక్షలు ఖర్చుపెట్టి విమానంలో మీడియా అంతా తీసుకురావడంలో అర్థంలేదని మీడియానుంచి గుసగుసలు వినిపించాయి. ఒకరకంగా ఈ వేడుకలో తమకు కావాల్సిన విషయాలు పెద్దగా లేవని నిట్టూర్పు విడిచారు. ఫంక్షన్ జరుగుతున్నంత సేపు నేషనల్ మీడియా పెద్దగా రియాక్ట్ కాలేదు. మామూలుగా అయితే హీరో వచ్చిన కార్యక్రమాల్లో వారి జోష్ మామూలుగా వుండదు. ఫ్యాన్స్ కంటే హై లెవల్ లో వుంటుంది. బెంగులూరు, చెన్నై, ముంబై వంటి చోట్ల నేషనల్ మీడియా ఏదైనా సినిమా వేడుకకువస్తే అక్కడ చాలా సందడి కనిపిస్తుంది. కానీ నిన్న హైదరాబాద్ లో జరిగిన వేడుక చాలా సప్పగా అనిపించిందని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ పవన్ వస్తే, సినిమాకంటే రాజకీయంగా పలు సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందనే వార్తలు కూడా వినిపించాయి. దానితో ఆయన రాలేదని టాక్ నెలకొంది.
 
కొసమెరుపుగా, నిర్మాత మాట్లాడుతూ, ఇంకా మూడు ఈవెంట్లు చేయనున్నామని అన్నారు. మరి అవి ఎక్కడ చేస్తారనేది చెప్పలేదు. ఇతర చోట్ల చేస్తారనే టూకీగా తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో వేడుక జరగనున్నదనీ, దానికి పవన్ కళ్యాణ్ హాజరవుతారని కీరవాణి మాట్లలను బట్టి తెలుస్తుంది. హరిహరవీరమల్లు సినిమా అసుర.. పాట ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, ధర్మం కోసం చేసిన పోరాటమే ఈ సినిమా కథ. దక్షినాది భాషల్లో పాటు బాలీవుడ్ లో కూడా పవన్ సినిమా విడుదల చేయడానికి కారణంవుంది. అక్కడ ఇలాంటి నేపథ్యాలు చూస్తారు. దానిపైనే మాకు ఆశ వుందని అన్నారు. సో. ఛావా సినిమా కూడా ఇలాంటి కథే. కాకపోతే హరిహరవీరమల్లు కథ వేరు. అందుకే బాలీవుడ్ లో ఫంక్షన్ ఏర్పాటు చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ సరసన విజయశాంతి!!