Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

Advertiesment
Venuswamy

దేవీ

, గురువారం, 22 మే 2025 (11:07 IST)
Venuswamy
ఈమధ్య జాతీకాలు చెప్పేవారు అందులో సినిమారంగంలోని హీరోహీరోయిన్ల గురించి చెబుతూ ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో వేణుస్వామి ఒకరు. ఒకప్పుడు సినిమా షూటింగ్ లకు పూజ చేయడానికి వచ్చేవారు. ఆ తర్వాత ఇది సరైంది కాదని తనకు తెలిసిన జాతకాల విద్యతో ప్రముఖులను ఆకట్టుకున్నాడు. ప్రతిసారీ తనకు చెందిన ఛానల్ లో పలు రకాలుగా దేశం గురించి ప్రపంచం గురించి చెబుతుంటారు.

ఆమధ్య నాగచైతన్య, సమంత విషయంలోనూ చెప్పింది నిజమైందని  అన్నారు. ఇప్పుడు మరోసారి పెండ్లిచేసుకున్న చైతు కూడా ముందుముందు నిలబడని వివాహ బంధం అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయనపై కేసులుకూడా పెట్టారు. అయినా తాను చెప్పేది చెబుతాను. ముందుగా జాగ్రత్తపడతారని అంటున్నాడు.
 
తాజాగా ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో ఒక హీరో ఒక హీరోయిన్ 2027-28లో ఇద్దరూ చనిపోతారు. అందులో ఒకరు అనారోగ్యంతో చనిపోతారు. మరొకరు ఆత్మహత్య చేసుకుంటారని వెల్లడించారు. అయితే పేర్లు చెప్పను అంటూ. మేషరాశి హీరోయిన్, వ్రుశ్చిక, మిధునరాశి లకు చెందిన ముగ్గురు నాద్రుష్టిలో వున్నారు. వారితో ఇద్దరు చనిపోతారంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.
 
విజయదేవరకొండ లైగర్ పోతుందని చెప్పాను. పోయింది. ఇప్పుడు ఇ.డి. కేసులో ఇరుక్కున్నారు. ఆయనతోపాటు పూరీ జగన్నాథ్ కూడా వున్నాడు. తర్వాత కరన్ జోహార్ కూడా ఇ.డి. క్వశ్చన్ చేయబోతోంది. నేను చెప్పినవన్నీ జరిగాయి. అయితే ఇలా చెప్పడంతో ముందు జాగ్రత్తగా వారు వుంటారనే చెబుతున్నాను అంటూ తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్