Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

Advertiesment
suicide

ఠాగూర్

, గురువారం, 22 మే 2025 (11:09 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఎన్ని పెళ్ళి సంబంధాలు చూసినా తనకు సెట్ కావడం లేదన్న మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగర శివారు పరిధిలోని పెదతూప్ర గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్ (32) అనే వ్యక్తి స్తానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొన్ని నెలులుగా అతని కుటుంబ సభ్యులు ప్రవీణ్‌కు తగిన వధువు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, వారు చూసిన అనేక సంబందాలు వివిధ కారణాలతో ఓ కొలిక్కి రాలేదు.
 
ఇలా కొన్ని నెలలుగా వరుసగా ఎదరవుతున్న పరిణామాలతో ఆ వ్యక్తి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పైగా, పెళ్లి విషయంలో అడ్డుంకులను తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ప్రవీణ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి