Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీరు సేవిస్తూ డ్రైవ్ చేసిన వ్యక్తి : వీడియో వైరల్

Advertiesment
drunk and drive

ఠాగూర్

, సోమవారం, 5 మే 2025 (18:35 IST)
హైదరాబాద్ నగరంలోని టోనీచౌకీలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బీరును తాగుతూ కారును డ్రైవింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టోలీచౌకీ వంతెన వద్ద మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తి మరో వ్యక్తి వీడియో తీసి ఆపమని కోరాడు. అయినా ఆపకుండా దూసుకెళ్లిన సదరు వ్యక్తి ఆదివాం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ వీడియోను మీరుకూడా చూడండి. 
 
జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర! 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జైళ్ళను పేల్చేవేసేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారు. జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయుకులను విడిపించేందుకు వీలుగా ఈ భారీ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌ సెంట్రల్ జైలు, కోట్ బాల్వాల్ జైలు, జమ్మూలోని జైళ్లకు భారీ ఎత్తు భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి కేసులో అనేక మంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి జైళ్లలో బంధించారు. వీరితో పాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది.
 
ఈ నేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది. దీంతో ఆయా కారాగాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లుచేశారు. ఇప్పటికే సీఐఎస్ఎఫ్ డీజీ శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో ఈ అంశంపై భేటీ అయినట్టు సమాచారం. 2023 నుంచి జమ్మూకాశ్మీరులో జైళ్ల భద్రత ఈ దళం ఆధీనంలో ఉన్న విషయం తెల్సిందే. మరోవైపు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ సెక్టార్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదస్థావరాన్ని గుర్తించాయి. దీనిలో కమ్యూనికేషన్ పరికరాలు, ఐదు ఈఐడీలు లభ్యమయ్యాయి. ఈ స్థావరం సురాన్ కోట్ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉండటం గమనార్హం. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...