'సన్నాఫ్ సత్యమూర్తి'తో మరోసారి 'రంగస్థలం' లచ్చిమి
సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ సరసన నటించిన సమంత ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలసిందే. పెళ్లాడాక ఇక సినిమాల సంఖ్య తగ్గిస్తుందిలే అనుకుంటే సమంత మాత్రం తన దూకుడుని ఏమాత్రం తగ్గించడంలేదు. వరుసగా చిత్రాలను చేసేందుకు సంతకాలు పెట్టేస్తోంది. తాజాగా
సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ సరసన నటించిన సమంత ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలసిందే. పెళ్లాడాక ఇక సినిమాల సంఖ్య తగ్గిస్తుందిలే అనుకుంటే సమంత మాత్రం తన దూకుడుని ఏమాత్రం తగ్గించడంలేదు. వరుసగా చిత్రాలను చేసేందుకు సంతకాలు పెట్టేస్తోంది. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే... అల్లు అర్జున్ సరసన నటించేందుకు సమంత సై అన్నదట.
మనం, 24 చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రంలో సమంత నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రంలో సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుందని సమాచారం. కాగా అల్లు అర్జున్ జంటగా గతంలో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.