ద్విచక్రవాహనంలో వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు నటుడు సాయిధరమ్ తేజ్. తీవ్రంగా గాయాల పాలై హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదని.. భుజానికి సర్జరీ ఫెయిల్ అవుతోందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఓకల్ కార్డు సర్జరీ వల్ల సాయి తేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నా.. భుజం నొప్పి ఎక్కువగా సాయిధరమ్ తేజ్‌ను బాధిస్తోందని వివరించారు. దీంతో సాయిధరమ్ తేజ్‌ను అమెరికాకు తీసుకెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేశారట కుటుంబ సభ్యులు.
అమెరికాలో చికిత్స చేయిస్తే త్వరగా కోలుకుంటాడని.. మళ్ళీ సినిమాల్లో నటిస్తారన్న నమ్మకం తేజ్ కుటుంబ సభ్యుల్లో ఉందట. అందుకే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట. దసరా తరువాత సాయి ధరమ్‌ను అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి పంపించే అవకాశాలు ఉన్నాయి.
అమెరికాలో ట్రీట్మెంట్‌కు సంబంధించి ఏర్పాట్లను చేసుకుంటున్నారట తేజ్ కుటుంబ సభ్యులు. వైద్యులతో మాట్లాడడం.. అలాగే ఎన్నిరోజులు ఆసుపత్రిలో ఉండాలన్న విషయాలపై మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా సాయిధరమ్ తేజ్‌ను అమెరికాకు తీసుకెళితే బాగుటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.