ఇండియన్ అమెరికన్ శ్రీ సైనీ రికార్డు సృష్టించింది. మిస్ వరల్డ్ అమెరికా 2021గా నిలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా నిలిచింది. వాషింగ్టన్ స్టేట్‌కు చెందిన ఆమెకు ఈ సందర్భంగా డయానా హేడెన్ కిరీటం పెట్టారు. 12 ఏళ్ల వయసులో ఓ కారు ప్రమాదంలో ముఖమంతా కాలిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా మిస్ వరల్డ్ అమెరికాగా నిలిచే స్థాయికి చేరడం విశేషం. లాస్ ఏంజిల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా మెడ్‌క్వార్టర్స్‌లో ఈ కాంపిటిషన్ జరిగింది.
ఇందులో విజేతగా నిలిచిన తర్వాత శ్రీ సైనీ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉంది. ఈ ఫీలింగ్స్‌ను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్ అంతా మా తల్లిదండ్రులకే దక్కుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ నా వెంటనే నిలిచిన మా అమ్మకు. థ్యాంక్యూ మిస్ వరల్డ్ అమెరికా అని చెప్పింది. ఈ ఘనత సాధించిన తొలి ఏషియన్, తొలి ఇండియన్ అమెరికన్‌గా నిలిచినందుకు గర్వంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.