Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

96 కాంబో మళ్లీ రిపీట్.. హీరోయిన్ త్రిషనా.. తాప్సీనా..?

Advertiesment
96 కాంబో మళ్లీ రిపీట్.. హీరోయిన్ త్రిషనా.. తాప్సీనా..?
, సోమవారం, 7 సెప్టెంబరు 2020 (22:10 IST)
విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్‌లో ఇప్పటికే 96 చిత్రం రాగా బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ తెరపై సందడి చేయనుంది.

సుదీర్ఘ విరామం తర్వాత దక్షిణాది బ్యూటీ త్రిష హార్రర్ కామెడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డెబ్యూట్ డైరెక్టర్ దీపక్ తెరకెక్కిస్తున్నాడు. 
 
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్టులో సీనియర్ నటి రాధిక ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

పాపులర్ కమెడియన్ యోగిబాబు కూడా ప్రధాన రోల్‌లో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో తాప్సీ మరో రోల్‌లో కనిపిస్తుందని టాక్. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందిని రాయ్‌ ఫోటోలు నెట్టింట వైరల్..