Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'RRR'లో భయంకరమైన విలన్‌గా ప్రియమణి...?

Advertiesment
'RRR'లో భయంకరమైన విలన్‌గా ప్రియమణి...?
, శనివారం, 1 డిశెంబరు 2018 (20:41 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో నటించే హీరోలు వివరాలు మాత్రమే తెలిసాయి కానీ హీరోయిన్లు ఎవరనేది ఇప్పటివరకూ బయటకు రాలేదు. ముగ్గురు హీరోయిన్లు వుంటారనే సమాచారం వచ్చింది.
 
ఈ ముగ్గురిలో కీర్తి సురేష్, రష్మిక మందన అనే రెండు పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా మరోపేరు బయటకు వచ్చింది. ఎవరంటే... ప్రియమణి. ఈ చిత్రంలో ప్రియమణి భయంకరమైన విలన్ పాత్రలో పోషించనున్నట్లు టాలీవుడ్ న్యూస్. ఐతే రాజమౌళి మాత్రం ఎప్పటిలాగే సైలెంటుగా వున్నారు. ఇప్పటివరకూ హీరోయిన్లు ఎవరూ అనేది మాత్రం చెప్పనేలేదు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను డిసెంబరు 12న చెపుతారని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మరి ప్రచారంలో వున్నట్లుగా చెపుతారో... లేదంటే అది కూడా ఓ గాలి కబురుగా మిగిలిపోతుందో చూడాలి.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాన్వీతో మూవీ గురించి విజయ్‌ దేవరకొండ ఏమ‌న్నాడో తెలుసా..?