Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోలీవుడ్ దర్శకుడిపై మనసు పారేసుకున్న కంగనా రనౌత్? (video)

Advertiesment
కోలీవుడ్ దర్శకుడిపై మనసు పారేసుకున్న కంగనా రనౌత్? (video)
, బుధవారం, 24 మార్చి 2021 (08:40 IST)
సినీ నటి అమలా పాల్ మాజీ భర్త ఏఎల్.విజయ్. ఈయన కోలీవుడ్ దర్శకుడు కూడా. దివంగత జయలలిత జీవిత చరిత్రను "తలైవి" పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ వచ్చే నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో జయలలితగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించింది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం కంగనా రనౌత్ పుట్టినరోజైన మార్చి 23వ తేదీన చెన్నైలో జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో నటి కంగనా రనౌత్ మాట్లాడుతూ బోరున విలపించారు. పైగా, ఎంతో సంతోషంగా ఉండాల్సిన రోజున (బర్త్‌డే) ఆమె అలా కన్నీరుకార్చడంతో ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. హాలంతా ఒక్కస్సారి నిశ్శబ్దం ఆవహించింది. 
 
తనను ముప్పతిప్పలు పెట్టి, అష్టకష్టాలుపాల్జేస్తున్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ధీరవనితలా ఎదుర్కొంటున్న కంగనా రనౌత్... తలైవి చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అలా కన్నీరుకార్చడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. దీనికి కారణం లేకపోలేదు.
webdunia
 
"దర్శకుడు విజయ్‌ నన్ను హీరోయిన్‌గా కాకుండా హీరోలా ట్రీట్‌ చేశారు. దక్షిణాదిలో ఎటువంటి గ్రూపిజానికి తావులేదు. అందుకే, తమిళంలో చాలా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా. నా దర్శకుడి గురించి చెప్పాలంటే మాటలు చాలడం లేదు. నేను ఎప్పుడు ఎక్కడున్నా కూడా నన్ను నవ్విస్తుంటారు. ఆయన లాంటి వ్యక్తిని నా జీవితంలో ఇంత వరకు చూడలేదు" అని చెపుతూ ఒక్కసారిగా కన్నీరు కార్చారు. ఆ తర్వాత ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువున అదిమిపెట్టి.. తన ప్రసంగాన్ని కొనసాగించారు. 
 
ఈ మాటల వెనుక ఏదో పరమార్థం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన వైవాహిక జీవితం నుంచి అమలా పాల్ తప్పుకున్న తర్వాత దర్శకుడు ఏఎల్ విజయ్ ప్రస్తుతం ఒంటరిజీవితాన్ని గడుపుతున్నారు. పైగా, తలైవి షూటింగ్ నిమిత్తం కంగనా రనౌత్‌తో యేడాదిన్నరకాలం పాటు విజయ్ ఓ దర్శకుడుగా ప్రయాణించారు. కంగనాను దేవతంగా అభివర్ణించారు. పైగా, విజయ్ మంచి మనస్సుకు, తనను చూసుకున్న పద్ధతికి కంగనా ఫిదా అయిపోయి.. ఆయనపై మనస్సుపారేసుకుందా? అనే సందేహం కోలీవుడ్‌లో ఉత్పన్నమైంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అరణ్య' హిందీ వెర్షన్ రిలీజ్ వాయిదా... కారణం ఇదే!