Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సైరా' నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్నాడా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". తొట్టతొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం

'సైరా' నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్నాడా?
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (07:17 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". తొట్టతొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, హీరో రాంచరణ్ నిర్మిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటించనుండగా, బాలీవుడ్ హీరో అమితాబ్, టాలీవుడ్ హీరో జగపతిబాబు, కన్నడ హీరో సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతిలు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పిక్చర్‌ను చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 22వ తేదీన రిలీజ్ చేశారు. ఇదిలావుండగా, ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎ.ఆర్. రెహ్మాన్ పేరును ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను బిజీగా ఉన్నాననీ, అందువలన ఈ ప్రాజెక్టు చేయలేనని రెహ్మాన్ చెప్పినట్టు సమాచారం. 
 
తనకి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయనీ, అవి పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తుందని, అందుకని తనకి కుదరదని రెహ్మాన్ అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా ప్రస్తుతం జరుగుతోన్న ప్రచారం మాత్రమే. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనీ హీరోయిన్ - సల్మాన్ హీరోగా డేరా బాబా చిత్రం ప్లాన్... కానీ...