Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాఘవన్ సీక్వెల్‌లో అనుష్క.. గౌతమ్ మీనన్ కథ నచ్చిందట..!

Advertiesment
Raghavan
సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన రాఘవన్ సినిమా తెలుగులో విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రానుందని టాక్ వస్తోంది. కమల్‌హాసన్ ప్రస్తుతం ''ఇండియన్ 2'' చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాతే ''రాఘవన్'' సీక్వెల్ ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన రాఘవన్ (తమిళంలో వేటైయాడు-విలైయాడు) సినిమా సీక్వెల్‌లో అనుష్క నటించనుందట. 
 
ఇంకా కథ నచ్చడంతో ఇందులో నటించేందుకు స్వీటీ అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అనుష్క తాజా చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కోన వెంకట్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే రాఘవన్ సీక్వెల్‌లో నటించే అవకాశం రావడంతో ప్రస్తుతం స్వీటీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాది పర్వదినం రోజున మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ?