Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో నాకు నచ్చిన నేత చంద్రబాబు... రోజా అయితే ఏంటి..?

తెలుగు చిత్ర పరిశ్రమలో వానపాటల కథానాయికగా ముద్రపడిన భామల్లో వాణీ విశ్వనాథ్ ఒకరు. ఈమె మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఇతర అగ్రహీరోలందరితోనూ నటించి, మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు.

Advertiesment
Actress Vani Viswanath
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (09:46 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో వానపాటల కథానాయికగా ముద్రపడిన భామల్లో వాణీ విశ్వనాథ్ ఒకరు. ఈమె మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఇతర అగ్రహీరోలందరితోనూ నటించి, మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమై, ఇటీవలే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ మలయాళ భామ ఇపుడు తెలుగు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఫలితంగా ఈమె త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 
 
ఇదే అంశంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు టీడీపీ నాయకత్వం, సిద్ధాంతం నచ్చాయని అందుకే ఆ పార్టీలో చేరబోతున్నట్టు చెప్పారు. పైగా, భారత్‌లో తనకు నచ్చిన గొప్ప నేత చంద్రబాబు నాయుడని, అతని మార్గనిర్దేశకత్వంలో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నానని అన్నారు. 
 
వైకాపా మహిళా నేత, నటి రోజాకు మీరు ప్రత్యర్థిగా మారనున్నారా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, పార్టీలో చేరిన తర్వాత ప్రత్యర్థులు ఎవరైనా తనకు ఒకటేనని, అయితే, సరైన ప్రత్యర్థి ఉంటేనే థ్రిల్ ఉంటుందన్నారు. ఆ ప్రత్యర్థి రోజా అయినా, మరొకరైనా తన పూర్తి సామర్థ్యంతో ఎదుర్కొంటానని చెప్పారు. 
 
ఒక మలయాళీగా ఉండి తెలుగు రాజకీయాలపై ఎందుకు ఆసక్తిని చూపుతున్నారన్న ప్రశ్నకు, తనను ఆదరించింది తెలుగు ప్రేక్షకులేనని, చిత్ర రంగంలో తనకు గుర్తింపు కూడా ఇక్కడి నుంచే వచ్చిందని, అందుకే ఇక్కడ నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన "యుద్ధం శరణం" ... సినీ కెరీర్‌పై చైతూ డైలమా?