తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఆదివారం కూడా వ్యాక్సిన్ల విషయంలో ఓ ట్వీట్ చేశారు. ఇంకాస్త డోసు పెంచి మరీ ఘాటుగా తెలంగాణలో వ్యాక్సినేషన్‌పై షర్మిల కేసీఆర్‌పై విమర్శలు చేయడం గమనార్హం. తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి షర్మిల కేసీఆర్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా, సీఎం ఒక్కసారి కూడా ఆమెపై స్పందించకపోవడం విశేషం. తాజాగా కేసీఆర్‌పై షర్మిల దుమారం రేపే ట్వీట్ చేశారు.
ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ.. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..?
"తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి. అని వైఎస్ షర్మిల ఘాటైన విమర్శలు చేశారు.