తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై పొగడ్తలతో ముంచెత్తారు జగన్ సోదరి షర్మిళ. తెలంగాణాలో జూడాలు చేస్తున్న సమ్మెను సమర్థించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి పూర్తిస్థాయిలో వేతనాలు ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు.
తెలంగాణా రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిన నర్సులు విధులు నిర్వర్తిస్తుంటే వారిని ఉన్న ఫళంగా ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వం భావిస్తోందని ఇది సరైన పద్ధతి కాదన్నారు. మొదట్లో ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించారు.
కెసిఆర్ నిర్ణయాలతో కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు నాశనమవుతున్నాయని... గతంలో రాష్ట్రం విడిపోక ముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా ఇవ్వడంతో పాటు బాగా పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేసిన సంధర్భాలు ఉన్నాయని.. ఆయన ముందు చూపుకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు.