Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెరాస విజయగర్జన వాయిదా...

Advertiesment
తెరాస విజయగర్జన వాయిదా...
, మంగళవారం, 2 నవంబరు 2021 (08:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీ ఈ నెల 15న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభను 29కి వాయిదా వేసింది. వరంగల్‌లో నిర్వహించనున్న సభను రెండు వారాలు వాయిదా వేయాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 
 
వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాసర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్‌ ఎస్‌ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌, ఆరూరి రమేశ్‌, ధర్మారెడ్డి తదితరులతో కేసీఆర్‌ సోమవారం సమావేశమయ్యారు.
 
ఈ సందర్భంగా నేతలు తెలంగాణ విజయగర్జన సభను వాయిదా వేసి, ఈ నెల 29న తెలంగాణ దీక్షా దివస్‌ సందర్భంగా నిర్వహించాలని అభ్యర్థించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమ సారథి కేసీఆర్‌ 2009, నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆ రోజును ప్రతి సంవత్సరం దీక్షా దివస్‌గా జరుపుకొంటున్న నేపథ్యంలో అదే రోజు తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు అభిప్రాయపడ్డారు. 
 
స్వరాష్ట్ర సాధనకు మూలమైన దీక్షాదివస్‌ నాడే సభ జరుపాలన్న నాయకుల అభ్యర్థన పట్ల సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. వారి కోరిక మేరకు సభను 29న నిర్వహించాలని నిర్ణయించారు. తెరాస ఆవిర్భవించి 20 ఏండ్లు గడిచిన సందర్భంగా దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో విజయ గర్జన సభను నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కమిటీలు ఏర్పాటయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపాపై ఫిర్యాదుకు రాష్ట్రపతిని కలవనున్న వైకాపా బృందం