తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను అట్టహాసంగా ప్రారంభించారు. సచివాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అంతకుముందు గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దశాబ్ధి ఉత్సవాల సందేశాన్నిచ్చారు. ఏపీ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపీడికి గురైందన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని చెప్పారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.
ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొనాలని కేసీఆర్ చెప్పారు. ఇదిలా ఉంటే.. దశాబ్ది వేడుకల వేళ అందరి చూపు తెలంగాణ వైపే. మునుపెన్నడూ ఎరుగని రీతిలో 'తెలంగాణ మోడల్' పాలన ఆకర్షిస్తోంది. 2014, జూన్ 2 తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.