Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు తెలంగాణ ఓ కుటుంబ బానిసగా మారిపోయే పరిస్థితి : మంత్రి కిషన్ రెడ్డి

kishan reddy
, శుక్రవారం, 2 జూన్ 2023 (11:11 IST)
ఏ ఒక్కరి పోరాటం వల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అదేసమయంలో నేటి తెలంగాణ ఓ కుటుంబ బానిసగా మారిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగించామని.. మనసా, వాచా, కర్మణా సకల జనులు పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. ఏ ఒక్కరివల్లో తెలంగాణ రాలేదన్నారు. 
 
'ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం అమరులైన వారిని స్మరించుకుందాం. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నమస్సులు. ఒకరిద్దరి వల్లే తెలంగాణ రాలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చేందుకు కృషి చేసిన దివంగత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ సందర్భంగా నివాళులర్పిద్దాం. చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయనేది భాజపా ఉద్దేశం.
 
రాష్ట్రంలో కుటుంబపాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది. నేడు తెలంగాణ.. ఓ కుటుంబానికి బానిసగా మారే పరిస్థితి వచ్చింది. దొరికిన అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారు. తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? నిధులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫామ్‌హౌస్‌లు పెరుగుతున్నాయే తప్ప డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇవ్వట్లేదు. దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది? దళితబంధులో ఎమ్మెల్యేలు వాటా తీసుకుంటున్నారు. పేదలకు అండగా నిలిచే ఆరోగ్యశ్రీని అటకెక్కించారని ఆయన ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ శుభవార్త... ఏంటది?