Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కినేని అమలను చూసైనా అది తెచ్చుకోండి... ఎందుకని?

Advertiesment
అక్కినేని అమలను చూసైనా అది తెచ్చుకోండి... ఎందుకని?
, శుక్రవారం, 29 మార్చి 2019 (13:11 IST)
పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ముందుగా మన చుట్టుపక్కల వున్న పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలి. చాలామంది తినేటపుడు వున్న శ్రద్ధ తిన్న తర్వాత వాటిని పడవేసేటపుడు వుండదు. డ్రింక్స్ తాగితే ఆ గ్లాసులు, తిన్న తర్వాత విస్తరాకులు, ప్లేట్లు ఎక్కడబడితే అక్కడ పడేస్తుంటారు. అవి కాస్తా గాలికిగీలికి కొట్టుకుని డ్రైనేజి కాల్వలో పడి ఇబ్బందిపెడతాయి. ఇలాంటి చెత్తాచెదారాన్ని చెత్తకుప్పలో వేస్తే అది చేరాల్సిన చోటుకి చేరుతుంది. అన్నిరకాలుగా అందరికీ ఆరోగ్యకరంగా వుంటుంది. 
 
ఇక అసలు విషయానికి వస్తే... నిజామాబాద్ బోధన్ లోని ఖండ్‌గాంలో ఓ శుభకార్యానికి హాజరయ్యేoదుకు వచ్చిన అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల స్థానికంగా మురుగు కాల్వలను శుభ్రం చేసి అక్కడ ఉన్న అందరిని ఆశ్చర్యపరిచారు. 
webdunia
 
ప్రైవేట్ కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం పాఠశాల నుంచి బయటకు వస్తున్న సమయంలో పాఠశాల ఆవరణలో మురుగు కాల్వలో పెద్దఎత్తున చెత్త ఉండటాన్ని గమనించిన అమల అక్కడే వున్న చీపురు తీసుకున్నారు. దాంతో ఆమె స్వయంగా అంతా ఊడ్చారు. ఆ తర్వాత మురుగు కాల్వలో పడి ఉన్న చెత్తని తీశారు. ఎవరి గ్రామాన్ని వారే శుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు అవగాహన కల్పించారు. అమల అలా శుభ్రం చేయడాన్ని చూసైనా తమ పరిసరాలను పారిశుద్ధ్యంగా వుంచుకోవాలంటూ పిలుపునిచ్చారు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిస్కెట్ ప్యాకెట్ దొంగలించిన పాపానికి చంపేశారు..