Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌లో తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

gunshoot
, బుధవారం, 23 ఆగస్టు 2023 (09:51 IST)
హైదరాబాద్ నగరంలోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌లో విషాదకర ఘటన జరిగింది. గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి విధులు నిర్వహించి వచ్చిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగం హెడ్ కానిస్టేబుల్ చేతిలోని గన్ మిస్ ఫైర్ కావడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
పోలీసుల కథనం మేరకు.. కబుతర్ఖానా ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని వచ్చిన హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ నిద్రించే సమయంలో ఆయన చేతిలో ఉన్న పుతాకీ మిస్ ఫైర్ అయింది. తుపాకీలో నుంచి వచ్చిన తూటాలు అతని శరీరంలోకి చొచ్చుకుని పోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పందికి పాండ్స్ వాసన తెలుస్తుదా? : నారా లోకేశ్ 
 
టీడీపీ నేత నారా లోకేశ్‌ వైకాపా నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. పందికి పాండ్స్ వాసన తెలుస్తుందా, కృష్ణా జిల్లా వైకాపా నేతలు కూడా అంతే మండిపడ్డారు. అభివృద్ధి అంటే ఏంటో వీళ్లకు తెలియదన్నారు. కృష్ణా జిల్లాకి చంద్రబాబు 17 వేల మందికి ఉద్యోగాలు కల్పించే హెచ్‌సీఎల్ తీసుకొస్తే జగన్ క్యాసినో, పేకాట క్లబ్బు తీసుకొచ్చాడని గుర్తు చేశారు. 
 
మేథా టవర్స్‌లో ఐటీ కంపెనీలతో పాటు జిల్లాకు అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాం. జగన్ ఆ కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేస్తున్నాడు. జక్కంపూడి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసాం. జెడ్ సిటీ పేరుతో 7 వేల ఇళ్లు నిర్మించాం. మోడల్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుచేసి అశోక్ లేలాండ్, మోహన్ స్పిన్నింగ్ వంటి పరిశ్రమలతో దాదాపు 70 ప్లాస్టిక్ పరిశ్రమలు, 45 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 694 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు భూములు కేటాయించాం. ఇప్పుడు జగన్ ఆ కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేస్తున్నాడు.
 
వైసీపీ నాయకులకు నేను సవాల్ విసురుతున్నా. 15 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారో రండి, టైం అండ్ డేట్ మీరే ఫిక్స్ చేయండి. సింగిల్‌గా వస్తా. ఎవరి హయాంలో కృష్ణా జిల్లా అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 14 సీట్లు వైసీపీకి ఇచ్చారు. జగన్ చేసింది ఏంటి... చేతిలో చిప్ప పెట్టాడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 సీట్లూ టీడీపీకి ఇవ్వండి. నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ కృష్ణా జిల్లా వాసులకు లోకేశ్ పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీజీ వైద్య సీటును దక్కించుకున్న ట్రాన్స్‌జెండర్.. మెడికల్ హిస్టరీలోనే తొలిసారి...