హైదరాబాద్, ఎల్బీ నగర్‌లోని వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడిలో అద్దరు అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే... నాగోలు బండ్లగూడ కృషినగర్‌లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా టైలరింగ్ చేస్తోంది.
ఈ వృత్తి ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఆమె నివాసంపై దాడి చేయగా ఇద్దరు పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.