మన దేశంలో మద్యానికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. మద్యాన్ని సేవించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, యువత మద్యానికి బానిసవుతున్నారు. దీంతో మద్యం వినియోగం, విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇంటి వద్దకే మద్యాన్ని సరఫరా చేయనున్నారు.
ఢిల్లీ మంత్రుల సంఘం ఈ మేరకు ఆమోదం తెలిపింది. మద్యం విపణి సజావుగా కొనసాగినంతవరకు రిటైల్ మద్యం విక్రయాల తగ్గింపు ధరపై ఎలాంటి పరిమితి ఉండరాదని మంత్రుల సంఘం భావిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఢిల్లీ మద్యం పాలసీకి కేజ్రీవాల్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. త్వరలోనే దీన్ని కేబినెట్ ఆమోదం పంపుతున్నారు. కేబినెట్ పచ్చజెండా ఊపితే ఇక ఇళ్లవద్దకే మద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.