కరోనా తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో ఉద్యోగులను కార్యాలయాలకు తిరిగి రప్పించేందుకు ఆయా కంపెనీలకు తల ప్రాణం తోకకు వస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు అంటే... అలాగైతే మీ ఉద్యోగమే వద్దంటూ రాజీనామా చేసేస్తున్నారు.
తాజాగా యాపిల్ సంస్థకు కీలక ఉద్యోగి ఒకరు షాక్ ఇచ్చాడు. వారానికి కనీసం ఐదు రోజులు ఇకపై కార్యాలయం నుంచి పని చేయాలని యాపిల్ సంస్థ ఉద్యోగులకు సందేశాలు పంపింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇకపై కుదరదని తేల్చేసింది. దీనితో యాపిల్ ఉద్యోగుల్లో కీలక ఎంప్లాయి అయిన గుడ్ ఫెలో యాజమాన్యం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసాడు.
తనతో కలిసి పనిచేసే బృందం హ్యాపీగా వుంటేనే తను పనిచేయగలననీ, వాళ్లంతా కార్యాలయానికి వచ్చేందుకు సిద్ధంగా లేరు కనుక తను కూడా అందుకు సిద్ధంగా లేనంటూ యాపిల్ సంస్థ సీఈఓకి ఇ-మెయిల్ పంపాడట. విశ్వసనీయ సమాచారం ప్రకారం అతడికి ఏడాదికి రూ. 6 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకూ వున్నదట.