Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించి పెళ్లి చేస్కుంది... 15 రోజులకే ఈ మొగుడు నాకొద్దంటూ పారిపోయింది...

Advertiesment
ప్రేమించి పెళ్లి చేస్కుంది... 15 రోజులకే ఈ మొగుడు నాకొద్దంటూ పారిపోయింది...
, గురువారం, 4 జులై 2019 (16:18 IST)
ప్రేమ పెళ్లిళ్లు కొన్నిసార్లు రెండు ముక్కలవుతుంటాయి. మరికొన్ని బంధాలు ఎంతో దృఢంగా వుంటాయి. ఐతే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుని చిన్నచిన్న మనస్పర్థలతో కట్టుకున్న భర్తను వదిలేస్తారు. మరికొందరి విషయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తననే నమ్మి వచ్చిందన్న విషయాన్ని పక్కనపెట్టేసి ఆమెని హింసిస్తుంటారు. తెలంగాణలోని మేడ్చల్‌లో జరిగిన ప్రేమ పెళ్లి పెటాకులైంది. 
 
వివరాల్లోకి వెళితే... మేడ్చల్ చంద్రానగర్‌కు చెందిన వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకి కూడా ఇతడంటే ఇష్టం వుండటంతో గత మే నెల 15న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగానే వున్నారు. ఆ తర్వాత జూన్ 26న సదరు యువతి తన బంధువుల ఇంటికి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె తిరిగి జూలై 1న వచ్చింది. ఇక అప్పట్నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది.
 
భర్తను దూరంగా పెడుతుండటంతో అనుమానం వచ్చిన అతడు... ఆమెని నిలదీశాడు. దాంతో నువ్వు నాకు వద్దంటూ అతడికి చెప్పేసింది. అతడు ఎలాగో సర్దుకుందాం అనుకునేలోపుగా మంగళవారం నాడు తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇక ఫోన్ చేస్తుంటే స్విచాఫ్ చేసేసింది. దీనితో బెంబేలెత్తిపోయిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంజనీర్‌పై బురద పోసి బ్రిడ్జికి కట్టేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎక్కడ?