Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండ‌గా షాక్ - 5 నెల‌ల బాలుడు మృతి..!

సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే... షాక్ కొడుతుంద‌నే విష‌యం తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండ‌గా షాక్ కొట్టిందని వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి. అయినా.. ప్ర‌జ‌లు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే విష‌య

Advertiesment
సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండ‌గా షాక్ - 5 నెల‌ల బాలుడు మృతి..!
, సోమవారం, 11 జూన్ 2018 (12:30 IST)
సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే... షాక్ కొడుతుంద‌నే విష‌యం తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండ‌గా షాక్ కొట్టిందని వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి. అయినా.. ప్ర‌జ‌లు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. ఇంధ‌న్‌ప‌ల్లిలో సెల్ ఫోన్ వ‌ల్ల దారుణం జ‌రిగింది. 
 
మంచిర్యాల లోని జన్నారం మండలం ఇంధన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ఇద్దరికి విద్యుద్ఘాతం తగిలింది. ఐదు నెలల కుమారుడిని ఎత్తుకొని త‌ల్లి సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టింది. అంతే... ఒక్కసారిగా షాక్ కొట్టింది. 5 నెల‌ల బాలుడు మృతి చెందాడు. త‌ల్లి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పది రోజులుగా ఇంట్లోనే శవం.. దుర్వాసన.. అయినా పక్కనే కూర్చుని భోజనం..?