Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం కేసీఆర్‌కు కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష?!

సీఎం కేసీఆర్‌కు కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష?!
, శనివారం, 12 మార్చి 2022 (09:05 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు ఉన్నట్టుండి స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను ప్రగతి భవన్ నుంచి యశోద ఆస్పత్రికి తరలించి అనేక రకాలైన పరీక్షలు చేశారు. ఇలాంటి వాటిలో కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్షను కూడా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ పరీక్ష చేసినట్టు ఆస్పత్రి వైద్యులు ధృవీకరించలేదు. 
 
అసలు కరోనరీ యాంజియోగ్రామ్ అంటే ఈ పరీక్ష ద్వారా గుండెకు జరిగే రక్త ప్రసరణలో ఏమైనా అవరోధాలు ఉంటే కనిపెట్టవచ్చు. ఈ పరీక్షలో భాగంగా రోగి చేతి మణికట్టు వద్ద ప్లాస్టిక్ సూది అమర్చి ఈ క్యాథటర్ (సన్నటి పైపు)ను ధమని గండూ నెమ్మదిగా శరరీంలోకి పంపిస్తారు. 
 
ఎక్స్‌రే ఇమేజ్‌ల ద్వారా వైద్యులు క్యాథటర్ ఎక్కడ ఉందో గుర్తిస్తుంటారు. క్యాథటర్ నిర్ధేశిత ప్రదేశానికి చేరుకోగానే కాంట్రాస్ట్ అయోడిన్ ఉన్న సొల్యూషన్‌ను లోపలికి ఇంజెక్షన్ చేస్తారు. ఆ సొల్యూషన్ గమనం ఆధారంగా రక్తసరఫరాకు ఆటంకంగా ఉన్న బ్లాక్స్‌ను గుర్తిస్తారు. ఒకవేళ బ్లాక్స్ ఉంటే వెంటనే స్టంట్ వేసే ప్రక్రియను చేపడుతారు. 
 
కాగా, ఆస్పత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎపుడు వచ్చినా ఆయన కుమార్తె కవిత, ఎంపీ సంతోష్ ఉంటారు. కానీ ఈ దఫా కేసీఆర్ సతీమణి శోభ, మనవడు హిమాన్షు, అల్లుడు అనిల్, ఎంపీ సంతోష్, మంత్రి కేటీఆర్ తదితరులు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చకచకా అడుగులు.. బిడ్ల ఆహ్వానం