Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను నా ప్రియుడి దగ్గరికి ఏ క్షణంలోనైనా వెళ్లిపోతా: భర్తతో చెప్పిన భార్య

నేను నా ప్రియుడి దగ్గరికి ఏ క్షణంలోనైనా వెళ్లిపోతా: భర్తతో చెప్పిన భార్య
, శనివారం, 12 జూన్ 2021 (17:47 IST)
సాధారణంగా పెళ్ళయిన తరువాత ఎవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంటారు. కానీ ఒక భార్య మాత్రం తన విషయాన్ని నేరుగా భర్తకు చెప్పింది. నువ్వు నాకు నచ్చలేదు. నేను నా ప్రియుడితో వెళ్ళిపోతాను. ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చని భర్తకే చెప్పింది. 
 
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉదయ, జగద్గిరిగుట్టకు చెందిన సురేష్‌లకు ఐదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు. జగద్గిరిగుట్ట లోనే వీరు నివాసముండేవారు. కర్ణాటకకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి సురేష్‌కు పరిచయమయ్యాడు. ఆ పరిచయం సురేష్‌ భార్యతో అక్రమ సంబంధానికి దారితీసింది.
 
సురేష్ పనిమీద బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చే భాస్కర్, ఉదయతో ఎంజాయ్ చేసేవాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అసలు విషయం సురేష్‌కు తెలిసింది. భార్యను నిలదీశాడు. అయితే తాను ప్రియుడితోనే ఉంటానని తేల్చేసింది. భర్త ముఖం మీదే చెప్పేసింది.
 
నువ్వు పనికి వెళితే నేను ఇంటి నుంచి ప్రియుడితో వెళ్ళిపోతానంది. అయితే గొడవతో సరిపెట్టుకున్న సురేష్ తన భార్య అన్నంత పని చేయదనుకున్నాడు. అయితే రెండు రోజుల క్రితం మూడేళ్ళ కొడుకుని తీసుకుని ప్రియుడితో వెళ్ళిపోయింది. ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. 
 
భాస్కర్ ఆ ఇంటికి బాడుగ చెల్లించాడు. అయితే తమ సంబంధానికి మూడేళ్ళ కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించారు ఇద్దరు. గదిలో వేసి ఆ చిన్నారిని చిత్రహింసలు చేసి కొట్టారు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయిన ఆ బాలుడు చనిపోయాడు. పోలీసులకు సమాచారం రావడంతో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖ్యమంత్రి జగన్‌కి అమరావతి రైతుల ఫోబియా