Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో వ్యక్తి గల్లంతు

Advertiesment
డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో వ్యక్తి గల్లంతు
, ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (10:14 IST)
హైదరాబాద్ నగరం మరోమారు వరదలో మునిగింది. శనివారం రాత్రి రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. చాలా చోట్ల పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి.
 
అయితే, మణికొండలో ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతయ్యాడు. బంగారు ఆలయం రోడ్డులో నడుస్తూ వెళ్తున్న ఓ వ్యక్తి ఒక చోట అడుగుపెట్టగా గుంత ఉండడంతో ఆ గుంతలో పడిపోయాడు. వరద భారీగా ఉండడంతో ఆ వరదలో కొట్టుకుపోయాడు. 
 
శనివారం రాత్రి డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో నాలాలో కొట్టుకొనిపోయి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి గల్లంతయ్యాడని స్థానికుల ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాజీలు కానున్న మంత్రులు