Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో కరోనా హాట్ స్పాట్‌లు ఏవి?

Advertiesment
తెలంగాణాలో కరోనా హాట్ స్పాట్‌లు ఏవి?
, శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (15:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కేసులన్నింటికి మూలం నిజాముద్దీన్ మర్కజ్ అని నిర్ధారణ అయింది. అందుకే మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చిన వారిని గుర్తించే పనిలో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. 
 
ఈ పరిస్థితుల్లో తెలంగాణాలో శుక్రవారం మధ్యాహ్నం వరకు మొత్తం 154 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 9 మంది చనిపోయారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉన్నట్టు కనిపించి, ఇపుడు కట్టుతప్పింది. ఫలితంగా తెలంగాణా కంటే అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 161 కేసులు నమోదు కాగా, విజయవాడలో ఓ కరోనా రోగి చనిపోయారు. ఏపీలో నమోదైన కేసులన్నింటికీ మూలకేంద్రం నిజాముద్దీన్ మర్కజ్ అని తేలిపోయింది. 
 
అయితే, నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారు ఎక్కడెక్కడున్నారనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో మొత్తం 6 ప్రాంతాల్లో వీరు ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ పాత బస్తీ, భైంసా, నిర్మల్, నిజామాబాద్, గద్వాల్, మిర్యాలగూడ ప్రాంతాలను హాట్ స్పాట్‌లుగా గుర్తించారు. 
 
ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. హాట్ స్పాట్ల నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడి వారిని బయటకు పంపించడం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ హాట్‌స్పాట్‌ల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది చైనా హెల్త్ ఆర్గనైజేషన్ ... 10 లక్షలు దాటిన కరోనా కేసులు