Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటన షెడ్యూల్ ఇదే

Advertiesment
cmkcr
, శనివారం, 21 మే 2022 (09:21 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 30వ తేదీ వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం తొలుత ఢిల్లీకి వెళ్లారు. తొలి విడతగా శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ పలువురు జాతీయ రాజకీయ నేతలతో ఆయన సమావేశమై చర్చిస్తారు. 
 
ముఖ్యంగా, త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని ప్రతిపాదించే అంశంపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అలాగే, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అప్‌డేట్‌లను అందించే ఆర్థికవేత్తలతో పాటు ఇతర పార్టీల రాజకీయ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఢిల్లీలో పలు జాతీయ వార్తా సంస్థలకు చెందిన జర్నలిస్టులతోనూ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
 
కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సుధీర్ఘకాలం పాటు సాగిన ఆందోళనలో మరణించిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన 600 మంది రైతుల కుటుంబీకులకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందజేస్తారు. ఇందుకోసం ఈ నెల 22వ తేదీన ఆయన ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి ఈ నెల 22వ తేదీన చండీగఢ్‌కు చేరుకుంటారు. 
 
అ్కడ నుంచి మే 26న బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ కానున్నారు. మే 27న మహారాష్ట్రలో గాంధేయవాది అన్నా హజారేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఆ తర్వాత షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంకీపాక్స్ అంటే ఏమిటి.. అది ఎలా సోకుతుంది?