Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19న తెలంగాణా రాష్ట్రంలోని బీసీ గురుకులాలకు ప్రవేశ పరీక్ష

Advertiesment
19న తెలంగాణా రాష్ట్రంలోని బీసీ గురుకులాలకు ప్రవేశ పరీక్ష
, మంగళవారం, 14 జూన్ 2022 (08:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 19వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. 
 
ఈ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం తమ హాల్ టిక్కెట్లను http://mjptbcwreis.telangana.gov.in డౌన్ లోడు చేసుకోవాలని అధికారులు సూచించారు. 
 
రాష్ట్రంలోని మొత్తం బీసీ గురుకులాల్లో మొత్తం 2752 సీట్లు ఖాళీగా ఉండగా, ఈ సీట్ల కోసం 87,312 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏదేనీ సందేహలు ఉన్నపక్షంలో 040-23322377 లేదా 23328266 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూబ్లీహిల్స్ ఘటన.. కార్పొరేటర్‌ కుమారుడిపై దాడి..