Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డెడ్​లైన్​లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు

Advertiesment
డెడ్​లైన్​లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు
, బుధవారం, 6 నవంబరు 2019 (21:58 IST)
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు మంగళవారం అర్థరాత్రికే ముగిసింది. ఆ సమయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 487 మంది సిబ్బంది సమ్మతి పత్రాలను అందజేశారు.

సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరికపై విధించిన గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా గడువులోపు విధుల్లో చేరేందుకు 487 మంది సిబ్బంది సమ్మతి పత్రాలను అందజేశారు. మొత్తం 487 మంది లేఖలు అందించగా అందులో బస్​భవన్​లోని పరిపాలన సిబ్బంది 216 మంది ఉన్నారు.

గ్రేటర్​ హైదరాబాద్​ జోన్​లో 111 మంది, హైదరాబాద్​ జోన్​లో 73 మంది సిబ్బంది, కరీంనగర్ జోన్​ నుంచి 87 మంది విధుల్లో చేరేందుకు ముందుకొచ్చారు.
 
గుండెపోటుతో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి
కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కరీమ్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు.

కరీమ్ ఖాన్ కరీంనగర్ రెండవ డిపోలో మెకానిక్​గా పనిచేస్తున్నాడు. గత 15 రోజుల క్రిత కరీమ్​కి గుండెపోటు వచ్చింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండ్రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. కొద్ది రోజుల క్రితం డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్నాడు. అక్కడ మరోసారి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు.

మళ్లీ కరీమ్​ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కరీమ్ ఈ రోడు ఉదయం నాలుగు గంటల సమయంలో మృతి చెందాడు. కరీమ్ మృతితో ఆయన స్వగ్రామమైన ఆరెపల్లిలో విషాధ ఛాయలు అలముకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పరోక్షంగా కార్మికులను హత్య చేస్తున్నారని బంధువులు ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కేసీఆర్​ తక్షణమే రాజీనామా చేయాలి: లక్ష్మణ్​