Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

కేటీఆర్ - కవితలకు కుక్కకూడా ఓటు వేయదు : బీజేపీ ఎంపీ అర్వింద్

Advertiesment
arvind

ఠాగూర్

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (18:46 IST)
భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ కె.కవితలను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హైదరాబాద్ నగరంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కేటీఆర్, కవితలకు కుక్క కూడా ఓటు వేయదని చెప్పారు. పైగా, కేటీఆర్ ఇపుడు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 
 
తాను ఎపుడైనా, ఎక్కడైనా ఫైర్‌బ్రాండేనని అన్నారు. నా బండి నా చేతిలోనే ఉందని, సమయాన్ని బట్టి తాను గేర్ మారుస్తానని, అపుడే స్పీడ్ మారుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో పిచ్చి రాజకీయం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. 
 
మనోజ్ - మౌనికల నుంచి ముప్పు వుంది.. మోహన్ బాబు 
 
తనకు తన కుమారుడు మంచు మనోజ్, కోడలు మౌనికల నుంచి తనకు ముప్పు పొంచివుందని నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. మంచు ఫ్యామిలీలో తలెత్తిన వివాదంపై పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇపుడు సంచలనంగా మారింది. 
 
తన చిన్న కుమారుడు మంచు మనోజ్, కోడలు మౌనికపై చర్యలు తీసుకోవాలంటూ మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్, మౌనికల నుంచి తనకు ముప్పు ఉందన్నారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు మోహన్ బాబు సీపీకి లేఖ రాశారు.
 
నాలుగు నెలల క్రితం తన ఇంటి నుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్... మళ్లీ తన ఇంటికి వచ్చి, కొందరు సంఘ విద్రోహ శక్తులతో కలిసి అలజడి సృష్టిస్తున్నాడని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం ఉదయం తన నివాసంలో పరిచయం లేని కొత్త వ్యక్తులు ఉండడాన్ని గమనించానని, తాను ఆఫీసుకు వెళ్లగానే, తన ఇంటి వద్ద పరిస్థితి బాగా లేదని సిబ్బంది సమాచారం అందించారని వివరించారు.
 
'మనోజ్‌కు చెందినవారుగా భావిస్తున్న 30 మంది వ్యక్తులు నా నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నా సిబ్బందిని బెదిరించారు. మంచు మనోజ్, మౌనిక ఆజ్ఞ ఆ మేరకే వారు అలా ప్రవర్తించారు. నా ఇంటిని ఆక్రమించుకోవడమే కాకుండా, నా సిబ్బందిని బెదిరించారు. 
 
వారంతా నా ఇంటిలోనే తిష్ట వేసి, నా కోసం కాచుకుని ఉన్నట్టు తెలిసింది. అందువల్ల నాకు ముప్పు ఉండడంతో, నా ఇంటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ కుట్రకు కారకులు మనోజ్, మౌనిక. ఇప్పుడు నా వయసు 78 సంవత్సరాలు. ఈ వయసులో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడంతో నాకు తీవ్ర ముప్పు ఉందని భావిస్తున్నాను. నా ఆస్తులు కూడా ప్రమాదంలో పడ్డాయి.
 
అందుకే నా కొడుకు మనోజ్, కోడలు మౌనికపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నా నివాసం నుంచి మనోజ్, మౌనికలతో పాటు, ఇతర సంఘ విద్రోహ శక్తులను పంపించివేయండి. ముప్పు ఉన్న దృష్ట్యా నాకు తగిన భద్రత కల్పించండి... ఎలాంటి భయం లేకుండా ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను' అంటూ మోహన్ బాబు తన లేఖలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Redmi Note 14 5G సిరీస్, స్మార్ట్ ఆడియో ఉత్పత్తులను ఆవిష్కరించిన షియోమి