Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షేమ్... కడప నుంచి ఇద్దరు సీఎంలు.. అయినా ఇన్ని సమస్యలా? : డిప్యూటీ సీఎం (Video)

pawan kalyan

ఠాగూర్

, శనివారం, 7 డిశెంబరు 2024 (19:04 IST)
కడప జిల్లాలో ఉన్న సమస్యలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కడప మున్సిపల్ స్కూల్‌లో శనివారం నిర్వహించిన పేరంట్స్ టీచర్స్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని తాను అనుకోలేదన్నారు. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని, అందుకే ఇక్కడ అన్ని సమస్యలు తీరిపోయి ఉంటాయని తాను భావించానని చెప్పారు. కానీ, కడప పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదన్నారు. అదేసమయంలో నీటి సమస్యను ఖచ్చితంగా తీరుస్తానని భరోసా ఇచ్చారు. 
 
ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన కడప జిల్లాలో సమస్యలు ఉండవని అనుకున్నానని, కానీ.. ఇక్కడికి వచ్చాకే తెలిసింది.. సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు రూ.45 కోట్లు ఇచ్చామని పవన్ తెలిపారు. నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇస్తున్నాని చెప్పారు. తాగునీట విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనేదే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. 
 
రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదని, అవకాశాలను ముందుంది నడిపించే ప్రాంతమని చెప్పారు. అన్నమయ్య, వేమన, పుట్టిపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయులు పుట్టిన గడ్డ రాయలసీమ అని పవన్ గుర్తు చేశారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకోసం..: విద్యార్థులతో డిప్యూటీ సీఎం పవన్ (video)