Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కండమ్‌లు ఎక్కువగా వాడేది ముస్లింలే... చెప్పేందుకు సిగ్గుపడట్లేదు : అసదుద్దీన్

asaduddin

వరుణ్

, సోమవారం, 29 ఏప్రియల్ 2024 (12:47 IST)
అధిక సంతానం కలగకుండా ఎక్కువగా కండోమ్‌లు వాడిదే ముస్లింలేనని, ఈ విషయాన్ని చెప్పేందుకు సిగ్గుపడట్లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిం సోదరులను ఉద్దేశించి ఎక్కువ సంతానంగలవారు అంటూ పరీక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, ఎక్కువ మంది సంతాపం ఉన్న వారికి, చొరబాటుదారులకు దేశ సంపదను తిరిగి పంచాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందంటూ మోడీ ఎన్నికల ప్రచారంలో చేసిన విమర్శలను తప్పుబట్టారు. 'ఎక్కువగా కండోమ్‌లు ఉపయోగించేది ముస్లింలే' అని ఆదివారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించారు. 
 
'ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజల్లో ఎందుకు భయం సృష్టిస్తున్నారు? మోడీ ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా, సంతాన వృద్ధి తగ్గింది. ముస్లింలే ఎక్కువగా కండోమ్‌లు వాడతారు. ఈ విషయం చెప్పేందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు' అని అసదుద్దీన్ అన్నారు. ముస్లింలు జనాభాపరంగా మెజారిటీగా మారతారని నరేంద్ర మోడీ హిందువుల్లో భయం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలపై ఇంకెంత కాలం భయాన్ని వ్యాప్తి చేస్తారని నిలదీశారు. తమ మతం వేరైనప్పటికీ తాము ఈ దేశానికి చెందిన వాళ్లమని స్పష్టం చేశారు.
 
అధికార బీజేపీ చెబుతున్న మోడీ కీ గ్యారంటీ నినాదాన్ని కూడా ఆయన ఎద్దేవా చేశారు. దళితులు, ముస్లింలను ద్వేషించడమే మోడీ ఏకైక గ్యారంటీ అని చురకలంటించారు. అయితే ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ లేదా ప్రధాని మోడీ ఇంకా స్పందించలేదు. రాజస్థాన‌లోని బన్స్ వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. జాతీయ కుల సర్వేలో భాగంగా ఆర్థిక, వ్యవస్థీకృత నివేదిక కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రణాళికలను మోడీ ప్రస్తావించారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను తన ప్రసంగంలో జోడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరేళ్ల వయసున్న బుడ్డోడితో పోటీ పడుతున్నా : జో బైడెన్