అక్కినేని నాగచైతన్య ,సమంత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా సాగిన వారి కాపురం అనూహ్యంగా విడాకులకు దారి తీసింది. విడాకులకు కారణం ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్సే. వీళ్లు విడిపోయి సంవత్సరాలు గడుస్తున్నా.. వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రం ఆగట్లేదు.
విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా వున్నారు. తాజాగా ఓ నెటిజన్ చైతూకు సపోర్ట్ చేస్తూ సమంతను ఓ ప్రశ్న అడిగాడు. అందుకు సమంత కూల్‌గా ఘాటుగా రిప్లై ఇచ్చింది. మీ అమాయకపు భర్తను మీరు ఎందుకని మోసం చేశారు..? అంటూ ఓ నేటిజన్ ప్రశ్నించాడు. ఇందుకు సమంత ఇలా బదులిచ్చింది.
"సార్ ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా మీకు ఎటువంటి సహాయం కలగదు.. మీకు అంతా మంచి జరగాలి అని కోరుకుంటున్నాను.. అలాగే మీరు జీవితంలో బలంగా మారాలి అని ఆశిస్తున్నాను. ఇలా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి" అంటూ సమాధానం ఇచ్చింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో మరొకసారి సమంత-చైతన్య విడాకుల గురించి చర్చలు జరుగుతున్నాయి.