Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Begumpet Airport: ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ (video)

Advertiesment
Accident at Begumpet Airport

సెల్వి

, గురువారం, 6 ఫిబ్రవరి 2025 (16:26 IST)
Accident at Begumpet Airport
బేగంపేట విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతున్న క్రమంలో ఓ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ అదుపుతప్పి రన్ వే నుంచి పక్కకు ఒరిగిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ ముందు చక్రం వంగిపోవడంతో రన్ వే ను చీల్చుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లింది. దీంతో రన్ వే దెబ్బతింది. 
 
ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ల్యాండ్ అవుతూ అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పాడైన రన్ వేను ప్రస్తుతం అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. దీంతో బేగంపేట విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నుండి విజయవాడకు మొదటి ఫ్లిక్స్‌బస్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సు